రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 20వ తేదీన జిల్లాలో పర్యటిస్తున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ సిహెచ్ విజయ రావుతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 20వ తేదీన ఈ నెల ఉదయం 9-15 గంటలకు రామాయపట్నం ఓడరేవు ప్రాంతానికి విచ్చేసి 10 గంటల వరకు రామాయపట్నం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అక్కడ హెలిపాడు, శిలాఫలకం ఆవిష్కరణ, సభా వేదిక దగ్గర ప్రోటోకాల్, శాంతి భద్రత తదితర అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు.