జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఛిద్రమైన రోడ్లను డిజిటల్ రూపంలో తెలియచేయడానికి పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అల్లూరి రవీంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం ఎక్కడైతే రోడ్లు ఆధ్వాన్న స్థితిలో ఉన్నాయో వాటిని ఫోటోల రూపంలో, వీడియోల రూపంలో సోషల్ మీడియా వేదికగా ప్రజలకి చాటిచెప్పే కార్యక్రమాన్ని నిర్వహించారు.
వీటిలో భాగంగా ఉదయగిరి మండలం లింగమనేని పల్లె నుండి బండ గాని పల్లి వెళ్లే రోడ్డు దుస్థితి పై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజవర్గంలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని, గత సంవత్సరం రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ నిరసన తెలిపినప్పటికి రోడ్లను ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి రోడ్లు పరిస్థితి చూసి రోడ్ల వేయాలని డిమాండ్ చేశారు. రోడ్లు అధ్వానంగా ఉండటం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం స్పందించి వెంకటనే మరమ్మతులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పెట్లు కిరణ్ కుమార్, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.