అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోట పట్టణంలోని నందిశెట్టి వీధికి చెందిన వనజ(26) అదృశ్యంపై స్థానిక పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 9 తేదీ సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భార్య తిరిగి రాలేదని ఆమె భర్త భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు ఈ సందర్భంగా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa