ముమ్మిడివరం మండలంలోని లంక గ్రామాలు వరదకు వణుకుతు న్నాయి. గురజాపులంక జలదిగ్బంధంలో చిక్కుకోగా, 80శాతం మంది ప్రజలను బయటకు తరలించారు. మరో 20శాతం అక్కడే ఉన్నారు. లంకఆఫ్ ఠాణేలంక, కూనాలంక, చింతపల్లిలంక, చింతావాని రేవు, కమిని, సలాది వారిపాలెం, లంక ఆఫ్ గేదెల్లంక, పొట్టితిప్ప లంకగ్రామాల చుట్టూ నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో వారు ఇళ్లను ఖాళీ చేసి ఎగువకు వచ్చారు. ఠాణేలంక, గేదెల్లంక జడ్పీ ఉన్నత పాఠశాలల్లో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసినా అక్కడికి వెళ్లేందుకు బాధితులు ఇష్టపడడం లేదు. పడవల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.