ఈ మధ్య కాలంలో చిన్నా పెద్ద తేడాలేకుండా ప్రతి ఒక్కరూ ఫిట్నెస్పై దృష్టిపెట్టారు. వాళ్లకు అందుబాటులో ఉన్న ఎదో ఒక పరికరాలతో కసరత్తులు చేస్తున్నారు. అయితే ఓ ఆఫ్రికన్ తన ఫిట్నెస్ను పెంచుకునేందుకు ఓ మూగజీవిని ఎంచుకున్నాడు.
ఓ బలమైన మేకపోతుతో అతడు ఢీకొట్టే వీడియో నెట్టింట వైరల్గా మారింది. బండపై ఉన్న మేక తలను కింద ఉన్న వ్యక్తి తలతో బలంగా నెట్టాడు. కానీ ఆ మేక బలం ముందు అతడు ఓడాడు.