ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ కారణం వల్లనైనా రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి అంటూ బిహార్ ప్రభుత్వం తాజాగా కొత్త చట్టం తీసుకువచ్చింది.
దీనికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల చాలామంది రెండో పెళ్లిళ్లు చేసుకుంటుండడం, ఆపై ఉద్యోగం, పెన్షన్, సంబంధిత వివాదాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.