ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. నారాయణపూర్ జలాశయం నుంచి నీరు విడుదల చేస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతోంది.
ఆదివారం ఉదయం జూరాల ప్రాజెక్టుకు 1.50 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. అవుట్ ఫ్లో 1.53 లక్షల క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.