అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య ప్రపంచకప్‌లో భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్లో ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ పసిడి పతకంపై గురిపెట్టాడు.
గతేడాది న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచకప్‌లోనూ ఈ మధ్యప్రదేశ్ షూటర్ విజేతగా నిలిచాడు. పురుషుల ఈవెంట్లో శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో 52 మంది తలపడగా... ప్రతాప్ సింగ్ 593 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.