శాసన వ్యవస్థపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం జైపూర్‌లో రాజస్థాన్ శాసనసభలో జరిగిన ‘75 ఏళ్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం’ సెమినార్‌లో ప్రసంగించిన ఆయన.. శాసన వ్యవస్థ పనితీరులో నాణ్యత క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ విభేదాలు శతృత్వంగా మారకూడదని, రాజకీయ వైరం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సీజేఐ హితవు పలికారు.