పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 12 వరకు జరగబోయే ఈ సమావేశాల్లో మొత్తం 29 బిల్లులను తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. వీటిలో 5 పాతవి, 24 కొత్తవి ఉన్నాయి.
అయితే, తొలిరోజు రాష్ట్రపతి ఎన్నిక ఉండటంతో సమావేశం పెద్దగా జరగకపోవచ్చు. 21న ఓట్ల లెక్కింపు, 25న నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. అప్పటివరకు సమావేశాలు అంతగా సాగకపోవచ్చని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa