చిలమత్తూరు మండలంలోని కుషావతి నది ఒడ్డున చేనేపల్లి సమీపంలో వెలసిన ఏటిగడ్డ గంగమ్మ దేవత కూరగాయల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. భక్తులు భక్తి శ్రద్దలతో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో ఎంతో అందంగా అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భక్తులకు మహామంగళహారతి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.