అన్నమయ్య జిల్లా డీఈవో కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న సురేష్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆయన ఉద్యోగ నియామకం, విద్యార్హుతలకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ విషయాన్ని ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి ధ్రువీకరించారు. ఈయన జిల్లా డీఈవో కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తూ ఇటీవలే అన్నమయ్య డీఈవో కార్యాలయానికి బదిలీపై వచ్చారు.