పార్లమెంట్ వర్షకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే, విపక్షాలు ఆందోళనలు చేయటంతో రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. ద్రవ్యోల్బణం, జీఎస్టీ రేట్ల పెంపు పై చర్చ జరపాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి.
సభను ఆర్డర్‌లో పెట్టేందుకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రయత్నించారు. కానీ, సభ్యుల వినకపోవడంతో సభను మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు వెంకయ్యనాయుడు ప్రకటించారు.