ఏపీలో వరదలపై సీఎం జగన్ సోమవారం సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ బాధ్యత సీనియర్ అధికారులు, కలెక్టర్ల భుజాలమీద ఉందని అన్నారు. వచ్చే 48 గంటల్లో ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ.2వేల సహాయం అందాలని ఆదేశించారు. అలాగే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్ అందించాలని ఆదేశించారు.