శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తాత్కాలిక అధ్యక్షుడు రాణిల్ విక్రమెసింఘె స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు గోటబయ దేశం నుంచి పారిపోవడంతో ప్రజలు అధ్యక్ష భవనంలోకి చోరబడి అల్లకల్లోలం సృష్టించారు. ఈ నేపథ్యంలో దేశంలో పరిస్థితులు చేయిదాటకుండా రాణిల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.