100 రూపాయల కోసం ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై అమీర్ తెలిపారు. పిడుగురాళ్ల పట్టణంలోని బిలాల్ మసీద్ ప్రాంతానికి చెందిన షేక్ రఫీ అదే ప్రాంతానికి చెందిన షేక్ జానికి వంద రూపాయలు అప్పుగా ఇచ్చారు.
తిరిగి ఇవ్వాలని అడగ్గా వాగ్వాదం చోటు చేసుకుంది. తీగపైకి జానీ నెట్టటంతో రఫీ చేతికి గాయమైంది. రఫీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.