గుంటూరు జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య అధికారి సుమియా ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 21, మంగళగిరి4, తాడేపల్లి7, తాడికొండ 2, తెనాలి 7, కేసులు నమోదయినట్లు వెల్లడించారు.
ప్రజల అప్రమత్తంగా ఉంటూ విరివిరి గా మాస్క్ శానిటైజర్ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని వైద్యులు సూచించారు. కరోనా లక్షణాలు కలిగిన వారు వైద్యులను సంప్రదించి నిర్ధారణ చేసుకోవాలన్నారు.