బేతంచెర్ల: కరోనా నిర్మూలనలో భాగంగా ఇది వరకే వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు వేయించుకోవాలని నగర పం చాయతీ కమిషనర్ రమేష్ బాబు, వైద్యురాలు హేమ సాయి కీర్తి పిలుపునిచ్చారు.
సోమవారం నగర పంచాయతీ పరిధిలోని 6 గ్రామ సచివాలయాల్లో బూస్టర్ డోసుపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. సుమారు 600 మందికి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేశారు. ఏఎన్ ఎంలు మునేశ్వరి, రేణుకాదేవి, లక్ష్మిదేవి, అమల, తిప్పమ్మ పాల్గొన్నారు.