ఏపీలో అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి మంగళవారం ప్రభుత్వం ఆర్థికసాయం అందజేయనుంది. ఈబీసీ నేస్తం, మత్స్యకార భరోసా, రైతు ఇన్ పుట్ సబ్సిడీ, జగనన్న చేదోడు, విద్యాదీవెన, వసతి దీవెన, డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ పథకాలకు సంబంధించి 3.39 లక్షల మంది ఖాతాల్లో రూ.137 కోట్లను సీఎం జగన్ జమ చేయనున్నారు. మరోవైపు జూలై 22న వైఎస్సార్ కాపు నేస్తం, జూలై 26న జగనన్న తోడు నిధులు విడుదల చేయనున్నారు.