ఇంట్లో ఉన్న బల్లులు పోవాలంటే ఏమి చెయ్యాలో చూద్దాము. వెల్లుల్లి వాసన బల్లులకు అస్సలు నచ్చదు. వీటిని కనుక దంచి బల్లులు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో పెడితే అవి దరిదాపుల్లోకి కూడా రావు.
అలాగే ఉల్లిపాయ రసం చేసి దానిని బల్లులు తిరిగే ప్రాంతంలో స్ప్రే చేయడం వల్ల బల్లులు పారిపోతాయి. ఇంట్లో బల్లులు ఎక్కువగా కనపడే చోట కర్పూరం పొడి చేసి చల్లాలి. పొడి చల్లలేని చోట కర్పూరం బిళ్ళలు పెడితే బల్లులు ఆ వాసనకి రావు.