కేరళ తిరువనంతపురంలో నీట్ రాసే విద్యార్థినుల లో దుస్తువులు విప్పించిన సెంటర్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 100 మందికి పైగా విద్యార్థినులు బ్రా తీసేయాలని నిర్వాహకులు ఆదేశించారు. ఆ కేంద్రంలో ఎక్కువగా పురుష ఇన్విజిలేటర్లు ఉండటం, 3 గంటలకు పైగా వారి ముందు పరీక్ష రాయటంతో ఆవేదనకు గురయ్యారు. ఓ విద్యార్థిని పరీక్ష అనంతరం ఏడుస్తూ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.