స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఏ ప్రభుత్వం కూడా మేలు చేయలేదు అని ఆర్ క్రిష్నయ్య తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సీఎం శ్రీ వైయస్ జగన్ దేశంలో గతంలో ఎక్కడా లేని విధంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన సంపదలో వాటా ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం కేటాయించేలా, పార్లమెంటులో ప్రైవేటు బిల్లుపై సీఎం శ్రీ వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. బీసీల చరిత్రలో అది ఒక మైలురాయిలా నిలవనుంది. ఆ బిల్లు ఆమోదం పొందేలా మేము గట్టిగా ప్రయత్నిస్తాం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ బీసీలకు ఒకేసారి 10 మంత్రి పదవులు ఇవ్వలేదు. కానీ సీఎం శ్రీ వైయస్ జగన్, 25 మంది మంత్రుల్లో 10 మంది బీసీలు, 5గురు ఎస్సీలు, ఒక ఎస్టీకి, ఒక మైనారిటీకి పదవులు ఇచ్చి, దేశ చరిత్రలోనే ఆదర్శంగా నిల్చారు. ఇంకా నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన వాటా ఇస్తూ, నిర్ణయం తీసుకున్న ఏకైక వ్యక్తి జగన్‌గారు.