ఏపీ పల్నాడు జిల్లాలో మంగళవారం టీడీపీ నేతపై హత్యయత్నం జరిగింది. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి మార్నింగ్ వాక్కు బయల్దేరిన సమయంలో కొందరు దుండగులు గొడ్డళ్లతో దాడి చేసి పరారయ్యారు. ఈ దాడిలో బాలకోటిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిందెవరనే విషయాలు తెలియాల్సి ఉంది. టీడీపీ శ్రేణులు మాత్రం ఈ దాడికి పాల్పడింది వైసీపీ నేతలే అని ఆరోపిస్తున్నారు.