బ్యాంకుల్లో ప్రస్తుతం ఎఫ్ డీలకు(FD) 5 శాతం నుంచి 6 శాతం మధ్యలో వడ్డీని ఇస్తున్నారు.6శాతం కంటే కాస్త ఎక్కువగా కొన్ని బ్యాంకుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ బ్యాంకుల్లో కంటే పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసిన డబ్బులకు ఎక్కువగా వడ్డీని చెల్లిస్తోంది. అలాంటి స్కీమ్ లు పోస్టాఫీసుల్లో చాలానే ఉన్నాయి. అందులో ఇక్కడ మనం చెప్పుకునేది కిసాన్ వికాస్ పత్ర. దీనిలో ఎంత పెట్టుబడి పెడితే అంత రెట్టింపు డబ్బులు వస్తాయి. దేశంలోని ప్రతీ పోస్టాఫీసుల్లో ఈ పథకం అందుబాటులో ఉంది. ఈ సౌకర్యాన్ని దేశంలోని 1.5 లక్షలకు పైగా పోస్టాఫీసుల్లో పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
పోస్టాఫీసుల్లో కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికెట్ల రూపంలో పొదుపు పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. దీని కాల వ్యవధి 10 సంవత్సరాల 4 నెలలుగా ఉంది. ఈ 10సంవత్సరల తర్వాత మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఈ పథకాన్ని అతి చిన్న అమౌంట్ తో మొదలు పెట్టవచ్చు. రూ. 1000 నుంచి ఈ పథకం మొదలవుతుంది. దీనిలో ఎంత డబ్బు అయినా పొదుపు చేసుకోవచ్చు. దీనిలో ప్రస్తుతం ఎంత వడ్డీ రేటు అయితే ఉందో.. 10ఏళ్ల తర్వాత వరకు కూడా ఇదే వడ్డీ రేటుకు డబ్బులను ఇస్తారు.ప్రస్తుతం దీనిలో 6.9 శాతం వడ్డీ ఉంది. కిసాన్ వికాస్ పత్రను సర్టిఫికేట్ రూపంలో కొనుగోలు చేయాలి. ఇవి రూ.1000, రూ.5వేలు, రూ.10వేలు, రూ.50వేలు, రూ. లక్ష ఇలా ఉంటాయి. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ తెరవొచ్చు.
గరిష్టంగా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్‌ను ఓపెన్ చేయొచ్చు. మైనర్ పేరుతో కూడా గార్డియన్ కేవీపీ అకౌంట్‌ను తెరవొచ్చు. దీనిలో మెచ్యూరిటీ కంటే కూడా ముందే డబ్బులను విత్ డ్రా చేసుకునే వెసులు బాటు ఉంది. మెచ్యూరిటీ తర్వాత దేశంలో ఏ పోస్టాఫీసు నుంచైనా డబ్బులను తీసుకోవచ్చు. అత్యవసర సమయంలో డబ్బులను విత్ డ్రా చేసుకోవాలనుకుంటే.. 30 నెలల తర్వాత స్కీమ్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.