ఏపీ పల్నాడు జిల్లాలో టీడీపీ నేత వెన్నా బాలకోటిరెడ్డిపై మంగళవారం జరిగిన దాడిని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. హత్యలు, దాడులతో టీడీపీ కేడర్‌ను భయపెట్టాలనుకుంటున్న సీఎం జగన్ పాపాలు శిశుపాలుడిలా పండిపోయాయని ఫైరయ్యారు. ఫ్యాక్షన్ మనస్తత్వం బ్లడ్‌లోనే ఉన్న మీ పాలనలో పల్నాడు ప్రాంతం రక్తసిక్తమవుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారం కోల్పోతే వైసీపీని కాపాడేది ఎవరని ప్రశ్నించారు.