మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో సోమవారం రాత్రి దారుణం జరిగింది. విదిష జిల్లా శంషాబాద్‌కు చెందిన సునీల్ మాలవ్య, అరుణ అలియాస్ రచన (22) దంపతులు. భర్తను విడిచి ప్రియుడు రాజేంద్ర మాలవ్య (25)తో రచన నెల నుంచి సహజీవనం చేస్తోంది.
ఇది తట్టుకోలేని సునీల్ గత రాత్రి వారిని అటకాయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో రచన, రాజేంద్రలను పొడిచి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.