ఏపీకి ప్రత్యేక హోదా పై కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని, విభజన చట్టం ప్రకారం పెండింగ్ ఉన్న పనులను త్వరలో చేస్తామన్నారు.
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా లేదని తేలిపోయింది. విభజన హామీల్లో ప్రత్యేక హోదా కూడా ఒక అంశం. దాని అమలు సాద్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది.