ఏపీ మంత్రులు బొత్స, అంబటి రాంబాబు తన మాటలు వక్రీకరించి, విమర్శించడం బాధాకరమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. భద్రాద్రి రామాలయం, చుట్టుపక్కల ప్రాంతాలు మునగకూడదనేదే తన ఉద్దేశమన్నారు.
కరకట్టలు నిర్మించుకునేందుకు ఏపీకి ఇచ్చిన 5 గ్రామాలను తిరిగివ్వాలన్నారు. అయితే హైదరాబాద్‌ను ఇస్తారా అని ఏపీ మంత్రులు అనడం అర్థరహితం అన్నారు.