సాయుధ బలగాల్లో యువతను చేర్చుకునేందుకు కేంద్రం గత నెల 14న అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు దిల్లీ హైకోర్టుకు మంగళవారం బదిలీ చేసింది.
ఇతర హైకోర్టుల్లోనూ దాఖలైన పిటిషన్లను కూడా దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఆ పిటిషన్లు వేసినవారు దిల్లీ కోర్టులోనూ వాదించవచ్చని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది.