1993లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ క్రికెట్ లో బాల్ ఆఫ్ ది సెంచరీ ను పరిచయం చేశాడు. కళ్ళు చెదిరే ఆ బాల్ కి ప్రపంచ క్రికెట్ ఫిదా అయిపోయింది.
తాజాగా మరోసారి అటువంటి బంతినే పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షా గుర్తుచేశాడు. శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న టెస్టులో అద్భుతమైన స్పిన్నింగ్ డెలివరీతో కుశల్ మెండిస్‌ను అవుట్ చేశాడు.