మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను చంపేందుకు ఓ పాకిస్థాన్ వ్యక్తి యత్నించాడు. పాకిస్థాన్‌లోని మండీ బహుద్దీన్ పట్టణ వాసి రిజ్వాన్ అష్రఫ్ సరిహద్దులు దాటి రాజస్థాన్‌కు వచ్చాడు.
హిందుమాల్కోట్ బోర్డర్ అవుట్‌పోస్ట్ వద్ద అతడిని బీఎస్ఎఫ్ జవాన్లు జులై 16న అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 11 అంగుళాల కత్తి లభించింది. దీంతో అతడిని ఐబీ అధికారులు అరెస్ట్ చేశారు.