కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా SP ల అధ్యక్షతన మహిళా పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించడం జరిగింది. మహిళా పోలీసుల ప్రొబేషన్ డిక్లరేషన్, సర్వీస్ రెగ్యులరైజ్ అయిన సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు SP అభినందనలు తెలియజేసినారు. మహిళా పోలీసుల పనితీరు భేష్ అంటూ జిల్లా SP M.రవీంద్రనాథ్ బాబు, IPS కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలో మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసమే మహిళా పోలీసు వ్యవస్థ ఏర్పడిందని జిల్లా కలెక్టర్ తెలియజేసారు. పోలీసు శాఖ సహాయ సహకారాలకు కృతజ్ఞులం అని మహిళా పోలీసులు తెలిపారు.