తాడేపల్లి నుంచి రామాయపట్నం పోర్టు భూమి పూజ కార్యక్రమం కోసం బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి . సీఎం వెంట మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు పలువురు ఉన్నట్లు సమాచారం. రామాయపట్నం పోర్టుతో ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఒరవడి రానుంది. సహాయ, పునరావాసానికి రూ. 175.04 కోట్ల వ్యయం భరించనున్న ప్రభుత్వం. రెండు దశల్లో రూ.10,640 కోట్లతో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి రామాయపట్నం చేరుకుంటారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించి.. మధ్యాహ్నాం తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు. పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.