విద్యా, ఉద్యోగాలలో అమలు చేస్తున్న రిజర్వేషన్లలో క్రిమిలేయర్ పరిధిలోకి వచ్చేవారెవ్వరో తెలుసుకొందాం. 1. ఐఏఎస్, ఐపీఎస్, ఐ ఎఫ్ఎస్ గ్రూప్ వన్ ఉద్యోగాలలో నియామకం పొందినవారు, 2.తల్లిదండ్రులు డైరెక్టుగా గ్రూప్ 2 ఉద్యోగంలో నియామకము పొందినవారు , 3.తల్లిదండ్రులలో ఒక్కరైనా గ్రూప్ 2 ద్వారా ఉద్యోగంలో మొదట నియామకము కబడి లోపు గ్రూప్-1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందిన వారి పిల్లలు మాత్రమే క్రిమిలేయర్ గా పరిగణించబడతారు. సాధారణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి వార్షిక ఆదాయము 8 లక్షల రూపాయలు దాటిన వారి పిల్లలకు క్రిమిలేయర్ వర్తించదు. కానీ చాలామంది రెవెన్యూ సిబ్బంది, తహసీల్దార్లు క్రిమిలేయర్ పై సరి అయిన అవగాహన లేక సాధారణ బిసి ఉద్యోగులు, ఉపాధ్యాయుల వార్షికాదాయము ఎనిమిది లక్షలు దాటిన దని వారి పిల్లలకు ఓ బి సి సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. అందువలన వారి పిల్లలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఐఐటి ఇంజనీరింగ్ మెడికల్ ఇతర కోర్సుల లో రిజర్వేషన్లు కోల్పోతున్నారు.