కాల్షియం ఎముక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దంతాలను బలంగా ఉంచుతుంది. కణాల సాధారణ పనితీరు మెరుగు పరుస్తుంది. వివిధ కారణాల వల్ల మానవ శరీరంలో కాల్షియం లోపానికి దారితీస్తాయి. అనేక సమస్యలకు దారి తీస్తాయి. కాల్షియం లోపంతో బాధపడుతున్నారని మూడు సంకేతాలు మనకు సూచిస్తాయి. నిద్రలో ఇబ్బంది, అదనపు బరువు నియంత్రణ కాకపోవడం, పరేస్తేసియా అనే వ్యాధి కనిపించడం. ఈ వ్యాధి గురించి పెద్దగా వినకపోయినా, ఇది కాల్షియం లోపానికి సంకేతం కావచ్చు. వీటిని పసిగట్టి మనం కాల్షియం లోపాన్ని గుర్తిద్దాం.