--- వాముని దోరగా వేయించి, పొడి చేసి, ఆ పొడిని భోజనం చేసేటప్పుడు తొలిముద్దలో కలుపుకుని తింటే, కడుపుబ్బరం తగ్గుతుంది.
--- మరిగే నీళ్ళల్లో తరిగిన అల్లం ముక్కలను, నిమ్మరసాన్ని వేసి బాగా మరిగించి, కాస్తంత ఉప్పు చేర్చి రోజూ తాగితే, జీర్ణక్రియ వేగం పెరుగుతుంది.
--- తులసి ఆకుల్ని రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టి, ఆ తెల్లారే ఆ నీటిని తాగితే నోటి నుండి వచ్చే చెడు వాసనను అదుపు చేయవచ్చు.
--- గోధుమలతో చేసే జావా తాగితే రక్తపోటు తగ్గుతుంది.
--- అరికాళ్ళ మంటలను నివారించటానికి గోరింటాకుగాని, నెయ్యి కానీ, సొరకాయ రసం కానీ రాస్తే ఉపశమనం కలుగుతుంది.