ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాతో సమానమైన వేతనాన్ని చెల్లించాలని నిర్ణయించింది. ఆర్టీఐ కమిషనర్ల వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సమాచార కమిషనర్ కు నెలకు రూ.2,25,000 ను వేతనంగా చెల్లించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సమాచార హక్కు చట్టం 2005 సవరణ ప్రతిపాదనల కంటే ముందుగా నియామకం పొందిన వారికే ఇది వర్తిస్తుంది.