రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపిన తెలంగాణ నేతలు గుర్తించాలని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తనకు సాంకేతిక అంశాలు తెలియకున్నా కామన్ సెన్స్ ఉందని తెలిపారు. మంత్రి అయినంత మాత్రాన సాంకేతిక అంశాలన్నీ తెలియాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆరోగ్య శాఖల మంత్రులు ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తున్నారా? అంటూ గురువారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు.