దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ మోసపురెడ్డి తన ఫ్యాక్షన్ బుద్ధిని చూపించుకుంటున్నారు అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. మహాసేన నాయకులూ రాజేష్ సరిపళ్ళ విషయంలో శ్రీకాకుళం పోలీస్ వారు ప్రవర్తించిన తీరు మీద స్పందిస్తూ.... ప్రభుత్వ అరాచకాల్ని ప్రశ్నించినవారిని అంతమొందించేందుకు వెనుకాడటంలేదు. వైసీపీ సర్కారు దళితులపై సాగిస్తున్న దమనకాండని అంబేద్కర్ రాజ్యాంగం ప్రసాదించిన హక్కుతో నిలదీసిన మహాసేన రాజేష్‌పై ప్రభుత్వ పెద్దలు కక్ష కట్టి మరీ వేధింపులకి గురి చేస్తూనే వున్నారు. జగన్‌రెడ్డి గారు ప్రతిపక్షనేతగా వున్నప్పుడు అన్నట్టు ఏదో కడుపు మండి సోషల్‌మీడియాలో ఒక పోస్టు పెడితే ఉగ్రవాదుల్లా రాజేష్, అతని సహచరులని హింసించడం చాలా దారుణం. వాహనాలు లాక్కుని, లాకప్‌లో కొడుతూ వీడియో తీసి కొందరు పెద్దలకి పంపిన పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ. ఓ సైకో ప్రభుత్వ పెద్దని, దళితుడై ఉండీ..దళితుల్ని హింసిస్తోన్న ఓ ఉన్నతాధికారిని సంతృప్తి పరచడం కోసం గతంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుని టార్గెట్ చేసినట్టే. ఇప్పుడు మహాసేన రాజేష్‌ని టార్గెట్ చేస్తున్నారు. మహాసేన రాజేష్‌కి హాని తలపెట్టాలని చూస్తే, పరిణామాలు తీవ్రంగా వుంటాయి. వైసీపీ సర్కారు అరాచకాలను ఎదిరించి, అక్రమాల్ని ప్రశ్నించే మహాసేన పోరాటానికి మా సంపూర్ణ మద్దతు వుంటుంది అని తెలియజేసారు.