విజయవాడ నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొని పలు డివిజన్లలో పెండింగులో ఉన్న అభివృద్ధి పనులు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించడం జరిగింది అని వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ తెలిపారు. ఈ సందర్భంగా..... తూర్పు నియోజకవర్గంలోని డివిజన్ లలో టెండర్లు ఆమోదించిన పనులను తక్షణమే ప్రారంభించడానికి, అలాగే పెండింగులో ఉన్న అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.