జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యగారి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి ఈ రోజు ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ....పింగళి వెంకయ్యగారి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి మరణం విచారకరం. దేశ స్వాతంత్రోద్యమంలో తండ్రికి తోడుగా నిలిచి, ఆ తర్వాత పింగళి గొప్పదనం నేటి తరానికి తెలిసేలా ఎంతో కృషి చేసారు సీతామహాలక్ష్మీ గారు. సీతామహాలక్ష్మి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని చంద్రబాబు తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa