గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవాడలో కొనసాగింది. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరుగుతున్నా ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... 13వ డివిజన్,57వ సచివాలయం పరిధిలోని ఎలక్ట్రిసిటీ కాలనీ,7వ రోడ్డు,యనమలకుదురు లాకుల ప్రాంతంలో ఇంటిఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి వివరించి,ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్యపు ప్రచారాలు గురుంచి ప్రజలకు వాస్తవాలు వివరించడం జరిగింది. స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మరలా నేడు వైసీపీ పార్టీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని వారి సంతోషం వ్యక్తం చేశారు అని తెలియజేసారు.