మంగళగిరి: ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లో నుంచి డ్రా చేసిన జీపీఎఫ్ సొమ్ము ను ఎప్పటిలోగా జమ చేస్తారో చెప్పాలని శుక్రవారం ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఆగస్టు 3వతేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పీఆర్సీ పై కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. ఉద్యోగుల అకౌంట్లో నుంచి ప్రభుత్వం జీపీఎఫ్ సొమ్మును డ్రా చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు.