దేశంలో కోవిడ్ ఉధృతి క్రమంగా పెరుగుతోంది. రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 21,411 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 67 మంది కరోనా మహమ్మారి వల్ల చనిపోయారు. మొత్తం 20,726 మంది కోవిడ్ నుంచి తాజాగా కోలుకున్నారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,50,100కి చేరింది. ఇక దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 4.46 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.