2024 ఎన్నికలలో చంద్రబాబు సీఎంగా రావడానికి తెలుగు యువత ప్రధాన భూమిక వహించాలి అని చదలవాడ అరవింద్ బాబు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా, నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ.... పార్టీ ఇచ్చిన ఏ పిలుపునకైనా తెలుగు యువత స్పందించి ప్రజల మధ్యలో ఉండాలని, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. ఈసారి అవినీతి పరుడైన నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఓడించాలని, ప్రజా వ్యతిరేక చర్యలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.