వైసీపీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది,విద్య వ్యవస్థ పరిరక్షణ కోసం రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు పిలుపునివ్వడం జరిగింది. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు సాయి భార్గవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ...... ఎయిడెడ్ విద్యాసంస్థలు ప్రైవేటీకరణ, గత ప్రభుత్వ విద్యా పథకాలను నిర్వీర్యం చేసే కుట్ర సాగుతుంది. విలీన ప్రక్రియతో పేదలకు ప్రాథమిక విద్యను దూరం చేస్తోంది అన్నారు. అలానే టీఎనఎ్‌సఎఫ్ నాయకులు జిల్లా అధ్యక్షుడు కురపాటి హనుమంతరావు మాట్లాడుతూ.... విద్యారంగంలో ప్రభుత్వ వైఫ ల్యాలను విద్యార్థుల్లోకి తీసుకుపోయి ఉద్యమిస్తామన్నారు.