ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో గత కొన్నేళ్లుగా హత్యలు, కిడ్నాప్ లతో భయాందోళనలకు గురి చేస్తున్న సుంకర ప్రసాద్ నాయుడు ముఠాను అనంతపురం జిల్లా, గుంతకల్లు పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాకు నేతృత్వం వహిస్తున్న సుంకర ప్రసాద్ నాయుడు సహా 13 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినారు. అక్రమాలకు పాల్పడితే , ఒకవేళ ఆ సమయంలో తప్పించుకోవచ్చు ఏమో కానీ, ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండ చట్టానికి చిక్కక తప్పదు, కాబట్టి నేరాలోచన లేకుండా బాధ్యతాయుతంగా జీవించాలని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa