విజయవాడ తూర్పు నియోజకవర్గం , స్థానిక 4వ డివిజన్ ఎన్టీఆర్ వెటర్నరీ కాలనీలలో రూ.40,00,000/- ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించబోయే రోడ్లు నిర్మాణ పనులకు వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ శంకుస్థాపన చెయ్యడం జరిగింది. అలానే 3వ డివిజన్ గంగిరెద్దుల దిబ్బకి చెందిన కె.నీరజ్ గారికి జీవనోపాధి నిమిత్తం సెలూన్ షాప్ ఏర్పాటు చేసుకోవడానికి 'దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్' ద్వారా 30000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ప్రజలకి ఎటువంటి కష్టం వచ్చిన ఆదుకునేందుకు ప్రభుత్వం తో పాటుగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉందని తెలియజేసారు.