దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు సంఖ్యలో భారీ తగ్గుదల కనిపించింది. గత 24 గంటల్లో 16,866 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మహమ్మారి కారణంగా 41 మంది మృతి చెందారు. 18,148 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,50,877కు చేరుకుంది. రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో డైలీ పాజిటివిటీ రేటు 7.03 శాతానికి చేరుకుంది.