ఏక్‌నాథ్ తిరుగుబాటుతో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అసలైన శివసేన పార్టీ తమదేనని చెబుతూ శిందే వర్గం ఈసీకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో తాజాగా శివసేన నాయకత్వ హక్కులపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోకుండా ఆపాలని ఉద్ధవ్ వర్గం సుప్రీంను ఆశ్రయించింది. ఎమ్మెల్యేల అనర్హత అంశం సుప్రీంలో ఉండగా ఈసీ నిర్ణయం సరికాదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa